Templates by BIGtheme NET
Home >> Cinema News >> V సెలబ్రేషన్స్ లో సుధీర్ బాబు ఫ్యామిలీ

V సెలబ్రేషన్స్ లో సుధీర్ బాబు ఫ్యామిలీ


నాని – సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన మల్టీస్టారర్ `వి` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. శనివారం మిడ్ నైట్ షో వీక్షించేందుకు యూత్ ఆసక్తిని కనబరిచారు. ఇక వి సినిమాకి ఓవరాల్ ఆ మిక్స్ డ్ రివ్యూలొచ్చాయి. ఇక ఈ మూవీలో సుధీర్ బాబు కాప్ రోల్ కి మంచి పేరొచ్చింది. అతడి బాడీ లాంగ్వేజ్ సహా నటనకు మంచి మార్కులే వేశారు.

యాక్షన్ థ్రిల్లర్ V లో సుధీర్ బాబు నటన గురించి అతని అభిమానుల్లో చర్చ సాగుతోంది. సుధీర్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయిందని డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యిందని ప్రశంసలు కురిసాయి. యాక్షన్ సన్నివేశాలలో దృఢమైన ప్రభావాన్ని చూపగలిగాడు. నానీతో పోటీపడుతూ నటించాడన్న పేరొచ్చింది.

శనివారం రాత్రి సుధీర్ తన సన్నిహితులు కుటుంబ సభ్యులతో V విడుదల సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. అతను ఇన్ స్టాగ్రామ్ లో ఓ రెండు ఫోటోల్ని షేర్ చేశారు. వీటిలో షాంపైన్ బాటిల్ తెరిచి సెలబ్రేట్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఈ వేడుకల్లో మహేష్ బాబు మరో బావమరిది సంజయ్ స్వరూప్ సహా సుధీర్ బాబు వైఫ్ కూడా ఉన్నారు.