టీజర్ వస్తే చలి గిలి ఎగిరిపోవడం ఖాయం

0

సినీపరిశ్రమలో కమిట్ మెంట్ పై మీటూ ఉద్యమం ప్రభావం తెలిసిందే. ఇదే కాన్సెప్టుపై తెరకెక్కిస్తున్న తాజా సినిమా `కమిట్ మెంట్`. లవ్ .. డ్రీమ్.. హోప్.. ఫైట్ .. అనేది ట్యాగ్ లైన్. తేజస్వి- రమ్య పసుపులేటి- సిమర్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఆ నలుగురు భామల కమిట్ మెంట్ వెనక కారణమేమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది.

ఈ బోల్డ్ అండ్ స్పైసీ మూవీకి హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. `గాంధీ బాత్` ఫేం.. వెబ్ సిరీస్ సంచలనం అన్వేషి జైన్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. కమిట్మెంట్ ప్రీలుక్ ఫస్ట్ లుక్ ఇంతకుముందు వైరల్ గా దూసుకెళ్లాయి.

నలుగురు అందమైన మగువల గట్స్ ను ఆవిష్కరిస్తూ.. రకరకాల భంగిమలతో ఉన్న ఫోటోల్ని రివీల్ చేశారు. పోస్టర్ లో స్పైసీ కంటెంట్ యూత్ కి కనెక్టయ్యింది. ఇక ఈ మూవీలో తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ చెలరేగి నటిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. తాజాగా అందుకు ప్రూఫ్ ని చిత్రబృందం రివీల్ చేసింది.

రేపటితో శీతాకాలపు చలి అంతరించిపోతుంది! అంటూ ఊరించేస్తోంది తేజస్వి. కమిట్ మెంట్ టీజర్ వస్తోంది! అంటూ మంట పెడుతున్న ఈమోజీని చిత్రబృందం షేర్ చేసింది.. ఈ టీజర్ ప్రీలుక్ వీడియోలో తేజస్వి మాదివాడ అందచందాల్ని ఎలివేట్ చేసే ఫోటోషూట్ వేడెక్కించింది. నిజంగానే టీజర్ వస్తే చలి గిలి ఎగిరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది మరి. ఫుట్ లూజ్ ఎంటర్ టైన్ మెంట్.. F3 ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభయ్ రెడ్డి- సూర్య శ్రీనివాస్ – రమ్య పసుపులేటి-అన్వేష్ జైన్- మాగంటి శ్రీనాథ్ – సింగ్ బృందం ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)