జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు కాపీ మరక…!

0

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి.. ‘బాహుబలి’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ”ఆర్.ఆర్.ఆర్”(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ ను పరిచయం చేసిన జక్కన్న.. తాజాగా కొమరం భీమ్ పాత్రలో తారక్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దీని కోసం ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న సినీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిపారు. ఇదే క్రమంలో ‘రామరాజు ఫర్ భీమ్’ లోని కొన్ని షాట్స్ వేరే చోట నుంచి ఎత్తేశారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

చరణ్ ని పంచభూతాలైన అగ్నిలో చూపించిన రాజమౌళి.. తారక్ ని నీటిలో చూపించారు. ఎన్టీఆర్ స్టన్నింగ్ పెరఫార్మన్స్ కి అద్భుతమైన విజువల్స్ తోడై ఈ టీజర్ అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఉంది. అయితే ఇందులో కనిపించిన కొన్ని షాట్స్ వేరే చిత్రాలను పోలి ఉన్నాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ – సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఫిలిం మేకర్స్ ఏ సినిమా చేసినా అందులో ఈ సీన్ కాపీ అని.. స్టోరీ దీనికి ఇన్స్పిరేషన్ అని.. సాంగ్ పలానా ట్యూన్ కి అనుకరణ అని ఆధారాలతో సహా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోలో ఓ అగ్ని పర్వతం బద్ధలైనట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఆ షాట్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో అగ్నిపర్వతాల విస్ఫోటనం వీడియోలోని ఓ షాట్ ని జత చేస్తూ.. జక్కన్న కూడా కాపీ చేసాడని కామెంట్స్ చేస్తున్నారు. అలానే భీమ్ టీజర్ లోని మరికొన్ని షాట్స్ కూడా అనుకరించినవేనని.. రాజమౌళికి అంత పెద్ద సినిమా చేయడానికి సమయం సరిపోలేదని.. భారీ బడ్జెట్ మూవీకి మరికొంత సమయం కావాలంటూ ట్రోల్ చేస్తున్నారు.