బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దన్నాడో తెలుసా?

0

తెలుగు కమెడియన్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని పంచుకున్నారు. తన ఫ్యామిలీ గురించిన విషయాలను ఓ యూట్యూబ్ చానెల్ తో పంచుకున్నారు.

తాను సినిమా అవకాశాల కోసం చెన్నైలో నివాసం ఉంటున్న సమయంలో తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని బ్రహ్మాజీ తెలిపాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుందని.. ఒక కొడుకు కూడా ఉన్నాడని బ్రహ్మాజీ తెలిపారు. తమ మనసులు కలిశాయని.. అందుకే పెళ్లి చేసుకున్నానని వివరించాడు.

తన భావాలకు కరెక్ట్ గా సూట్ కావడంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని బ్రహ్మాజీ వివరించారు. ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా ఉన్నామని.. తన భార్య కొడుకుపై ప్రేమ తరిగిపోకూడదనే ఒక్క కారణంతోనే తనకంటూ పిల్లలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదని బ్రహ్మాజీ వివరించాడు. తనకు కొడుకు సంజయ్ అంటే అమితమైన ప్రేమ అని.. సినిమాల మీద ఇంట్రస్ట్ అని చెబితే కృష్ణ వంశీ దగ్గర చేర్పించానని బ్రహ్మాజీ వివరించాడు.

సినిమాలు ఖాళీగా ఉన్నప్పుడు తనను తన భార్యనే పోషిస్తుందని.. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుందని బ్రహ్మాజీ తెలిపారు. ఈ మధ్యనే కొడుకు పెళ్లి చేశానని వివరించారు.