కరోనా టెస్ట్ కు ఏడ్చేసిన పాయల్

0

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా తెలుగులో గుర్తింపు దక్కించుకున్న పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందస్తు జాగ్రత్తగా అందరు యూనిట్ సభ్యులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. అలా పాయల్ కు కూడా కరోనా నిర్థారణ పరీక్ష జరిగింది. కరోనా నిర్థారణ పరీక్షకు సంబంధించిన వీడియోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కరోనా పరీక్షకు గాను ముక్కు నుండి శాంపిల్ సేకరిస్తారనే విషయం తెల్సిందే. అందులో భాగంగా పాయల్ శాంపిల్ సేకరిస్తున్న సమయంలో భయపడి ఏడ్చేసింది. చాలా భయమేసిందని టెస్టు రిపోర్ట్ వచ్చే వరకు చాలా ఆందోళన చెందానంటూ పాయల్ ఇన్ స్టాలో పేర్కొంది. కరోనా టెస్టు నెగటివ్ రావడంతో షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా ఆమె పేర్కొంది. కరోనా నిర్థారణ టెస్టు చేయించుకుని షూటింగ్ కు వెళ్లడంతో పాటు షూటింగ్ స్పాట్ లో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా పేర్కొంది.