బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బడా సినిమాల హీరోయిన్ గా నెం.1 హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ దీపిక పదుకునే చేతిలో ప్రస్తుతం అయిదు పెద్ద సినిమాలు ఉన్నాయి. వందల కోట్ల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడి పారితోషికం ఇండియన్ హీరోయిన్స్ లోనే అత్యధికం అనడంలో సందేహం లేదు. ఈమె హీరోలతో పోటీగా పారితోషికం అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఇంటికి కావాల్సిన వస్తువులు సరుకులను తానే స్వయంగా కొనుగోలు చేయడంతో పాటు వాటిని సర్దుకుంటుందట.
ఈ విషయాన్ని తాజాగా ఒక మీడియా సంస్థతో ముచ్చటిస్తూ చెప్పుకొచ్చింది. ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంటి పనులు చేయడం వల్ల కాస్త ప్రశాంతత అనిపిస్తుందని అందుకే ఇంటికి కావాల్సినవి తానే తీసుకోవడం పాటు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను అంది. ఇంట్లో ప్రతి విభాగంను క్లీన్ గా ఉంచుకోవడంతో పాటు వంట విషయంలో కూడా ఎప్పటికప్పుడు పని వారితో చర్చిస్తూ ఉంటుందట. దీపిక ఇంతగా ఇంటి పనుల్లో కల్పించుకోవడం పట్ల రణ్వీర్ కపూర్ స్పందిస్తూ ఇంత బిజీగా ఉన్న నీకు ఇవన్నీ అవసరమా అంటాడట.