హీరో కార్తికేయను PK ఇన్సల్ట్ చేశారా?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (పీ.ఎస్.పీ.కే) బర్త్ డే సందర్భంగా .. ఇండస్ట్రీ టాప్ స్టార్లు సహా అభిమానులు శుభాకాంక్షలతో తమ ఫ్యానిజాన్ని చాటుకున్నారు. ఇందులో చరణ్.. మహేష్.. బన్ని సహా యువహీరోలు ఉన్నారు. ముఖ్యంగా ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ ప్రత్యేకించి పవన్ పై అభిమానం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.

అతడికి పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన రిప్లయ్ సర్ ప్రైజ్ చేసింది. “ధన్యవాదాలు సర్.. ఆల్ ది బెస్ట్“ అని పవన్ బదులిచ్చారు. దానికి కార్తికేయ చాలానే కంగారు పడ్డారు. సర్.. అని సంభోధించడంతో అతడు కాస్త కంగారు పడినట్టే కనిపించాడు.

“సార్ సార్ సార్ .. సార్ ఏంటి సర్.. లక్షలాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. మీరు రిప్లయ్ ఇవ్వడమే ఎంతో గొప్ప. మీ బర్త్ డేకు రిటర్నులో మంచి గిఫ్ట్ ఇచ్చారు.“ అంటూ ఎమోషన్ అయ్యాడు కార్తికేయ. అసలు ఇంతమంది అభిమానుల్లో పవన్ నుంచి రిప్లయ్ వస్తుందనే అతడు ఆశించినట్టు లేడు. రిప్లయ్ రావడమే కాదు .. ఎలాంటి స్టార్ యిజం.. ఈగోయిజం అనేవి లేకుండా అప్ కం హీరోని సార్ అని సంభోధించారు పవన్ కల్యాణ్. అయితే ఇది అతడు ఊహించనిది. అందుకే అలా కంగారు పడినా.. ఎంతో ఎగ్జయిట్ అయ్యాడనే అర్థమవుతోంది. ఆర్.ఎక్స్ 100 తర్వాత ఆశించిన పెద్ద విజయాలేవీ దక్కకపోయినా నటుడిగా కార్తికేయ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనూ సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.