రియా ఉద్దేశ్యపూర్వకంగానే డ్రగ్స్ ఇచ్చిందా ?

0

సుశాంత్ హత్య కేసును సీబీఐ వారు ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అది కూడా రియాతో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు అంటూ ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల వారు ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఎంక్వౌరీలో కూడా అదే విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మరింత ట్రబుల్స్ లో పడుతుంది. ఇప్పటికే ఈమె డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు సుశాంత్ కు డ్రగ్స్ సప్లై చేసినట్లగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రియా సోదరుడు శోవిక్ అరెస్ట్ అవ్వడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయ్యింది. ఈ కేసులో శోవిక్ చెప్పిన వివరాల ప్రకారం సుశాంత్ కోసం రియా డ్రగ్స్ కావాలని అడిగేది. నేను నాకు ఉన్న పరిచయాల ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడిని అంటూ చెప్పుకొచ్చాడట. అంటే రియా స్వయంగా సుశాంత్ కోసం డ్రగ్స్ తెప్పించేది. ఒక వేళ సుశాంత్ కు ముందు నుండే డ్రగ్స్ అలవాటు ఉంటే అతడే తెప్పించుకునేవాడు. కాని రియా డ్రగ్స్ కావాలని శోవిక్ ను అడిగేది కనుక ఖచ్చితంగా సుశాంత్ కు ఉద్దేశ్య పూర్వకంగానే రియా డ్రగ్స్ అలవాటు చేసిందనే వ్యాఖ్యలు ఫ్యాన్స్ చేస్తున్నారు.

ఈ విషయంలో వారు చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. డ్రగ్స్ కు బానిసను చేసి రియా వెళ్లి పోవడంతో సుశాంత్ క్రుంగిపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అంటూ అభిమానులు ఒక అంచనాకు వస్తున్నారు. మరి ఈ విషయంలో సీబీఐ వారు ఏం తేల్చబోతున్నారు అనేది చూడాలి.