రెమ్యూనరేషన్ తో కంగారు పెట్టేస్తున్న సమంత

0

సహజంగానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కు రెగ్యులర్ గా కంటే కాస్త ఎక్కువ పారితోషికం అందుతూ ఉంటుంది. హీరోయిన్స్ గా హీరోల పక్కన నటించడం పెద్ద రిస్క్ ఏమీ కాదు. కాని ఎప్పుడైతే సినిమా బాధ్యత మొత్తం మీద పడుతుందో అప్పుడు వారు ఎక్కువ పారితోషికంను డిమాండ్ చేస్తారు. ఈమద్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న సమంత పారితోషికం విషయంలో నిర్మాతలను భయపెడుతుందట. తెలుగు మరియు తమిళంలో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. కనుక అక్కడ ఇక్కడ రెండు చోట్ల సినిమాను విడుదల చేసి క్యాష్ చేసుకుంటారు కనుక మొహమాటం లేకుండా డబుల్ పారితోషికంను డిమాండ్ చేస్తుందట.

ఇటీవలే సమంతతో సినిమాకు ‘గేమ్ ఓవర్’ ఫేం అశ్విన్ శరవనన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పిన సమంత పారితోషికం విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదంటుందట. హీరోలతో నటించే కమర్షియల్ సినిమాల్లో కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు తీసుకున్న సమంత ఇప్పుడు ఈ ద్విభాష లేడీ ఓరియంటెడ్ సినిమాకు మాత్రం దాదాపుగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట.

మీడియం బడ్జెట్ తో అనుకుంటున్న మేకర్స్ కు ఆమె పారితోషికం షాకింగ్ గా అనిపిస్తుందట. దాంతో మరో విధంగా ఏమైనా వర్కౌట్ అయ్యేనా అంటూ దర్శక నిర్మాతలు చర్చరిస్తున్నారట. పారితోషికం తక్కువగా ఇచ్చి సినిమా నిర్మాణ భగస్వామి చేసి లాభాల్లో వాటాను ఇచ్చేందుకు నిర్మాత సరే అన్నట్లుగా తెలుస్తోంది. కాని సమంత ఈ విషయంలో ఏం అంటుందో అనేది చూడాలి.