కరోనా వారి రిలేషన్ ను మరింత కన్ఫర్మ్ చేసింది

0

బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ మలైకా అరోరా అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వ్యవహారం గత ఏడాదిన్నర కాలంగా మీడియాలో చర్చనీయాంశంగానే ఉంది. వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని పెళ్లి విషయంలో మాత్రం వీరు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించడం లేదు. అసలు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు వారు చెప్పలేదు. ఇద్దరి మద్య వ్యవహారం ఉందని పలు సందర్బాల్లో వీరు బయట కనిపించడం వల్ల తెలిసింది. తాజాగా కరోనా వల్ల వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.

అర్జున్ కపూర్ తాను కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆయన పాజిటివ్ అంటూ ప్రకటన వచ్చిన కొద్ది సమయం గ్యాప్ తో మలైకా అరోరా కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది అంటూ ఆమె సోదరి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇద్దరికి ఒకే సారి కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వీరిద్దరు కలిసే ఉంటున్నారు అనిపిస్తుంది.

పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో చాలా మంది సహజీవనం సాగిస్తున్నారు. వారిలో వీరు ఒక జంటగా నెటిజన్స్ అంటున్నారు. మలైకా కంటే వయసులో చిన్న అయిన అర్జున్ కపూర్ హీరోగా కెరీర్ ఏమాత్రం సరిగా లేదు. ఇలాంటి సమయంలో ఆమె ప్రేమలో మునిగి తేలుతు కెరీర్ విషయంలో అశ్రద్ద చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మలైకా ఇప్పటికే దాదాపుగా అయిదు పదుల వయసుకు దగ్గరకు వస్తుంది. కనుక ఆమె సినీ కెరీర్ పూర్తి అయినట్లే అంటున్నారు. కరోనా బారిన పడ్డ అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.