సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? .. రియాకు సీబీఐ ప్రశ్న

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక కారణాలపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు నేడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలుస్తోంది. ముంబై డీఆర్.డీఓ అతిథి గృహంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు.

అసలు సుశాంత్ తో పరిచయం.. ప్రేమ.. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు .. అతడి ఖాతా నుంచి ఎవరి ఖాతాలకు డబ్బు జమ అయ్యింది.. వగైరా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? అంటూ సీబీఐ అడిగిన ప్రశ్నకు రియా ఎలా స్పందించారు అన్నది తెలియాల్సి ఉంది. ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవకర్తిని కూడా అధికారులు విచారిస్తున్నారు.

రియా.. ఆమె సోదరుడు సహా పలువురుని సీబీఐ ప్రశ్నిస్తోంది. సుశాంత్ క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని.. వంట మనిషి నీరజ్ సింగ్ .. పని మనిషి కేశ్.. ఇంటి మేనేజర్ శ్యామ్యుల్ మిరిండా లను కూడా సీబీఐ ఆరాలు తీస్తోంది. ఇక సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి దాదాపు 15 కోట్లు కనిపించకుండా పోయిందని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. బిహార్ లో కేసు కూడా నమోదు చేశారు. ఇక డ్రగ్స్ మాఫియాతో రియా పరిచయాల గురించి ఇతరత్రా యాక్టివిటీస్ గురించి పలు ఆధారాలు లభించడంతో దానిపైనా సీబీఐ విచారిస్తోంది. ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని .. తను ఎవరి మాటా వినని వాడని రియా ఇంతకుముందు మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మునుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఉత్కంఠను పెంచుతోంది.