సుశాంత్ ఫామ్ హౌస్ లో జరిగే రేవ్ పార్టీలకు శ్రద్ధాకపూర్…?

0

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకొని చివరికి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి డ్రగ్స్ తో లింకులు ఉన్న పలువురిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ని డీలర్స్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రియా విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. డ్రగ్ వ్యహారాలన్నీ ముంబై సమీపంలో సుశాంత్ కు చెందిన లోనావాలా ఫామ్ హౌస్ లో జరిగేవని రియా చెప్పినట్లు తెలుస్తోంది. సుశాంత్ నిర్వహించే డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు యాక్టర్స్ డైరెక్టర్స్ మరియు అతని స్నేహితులు హాజరయ్యేవారని ఆమె చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ తో కలిసి ‘చిచోరే’ సినిమాలో యాక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా ఫామ్ హౌస్ లో నిర్వహించే రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యేదని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ విచారణలో సుశాంత్ ఫామ్ హౌస్ మేనేజర్ రాయీస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ నిర్వహించే రేవ్ పార్టీలకు రియా చక్రవర్తి – సారా అలీఖాన్ – శ్రద్ధాకపూర్ లు తరచుగా హాజరయ్యేవారని అతను చెప్పినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ పార్టీలలో గంజాయి – స్మోకింగ్ పేపర్స్ – ఖరీదైన వోడ్కా సాధారణమని కూడా రాయీస్ చెప్పాడు. 2018 సెప్టెంబర్ నుండి సుశాంత్ తో కలిసి తాను పనిచేస్తున్నానని.. లాక్ డౌన్ కు ముందు వరకు వారానికి ఒకటి రెండు సార్లు ఈ ఫామ్ హౌస్ కు సుశాంత్ వచ్చేవాడిని రాయిస్ వెల్లడించారు. అంతేకాకుండా లాక్ డౌన్ లో సుశాంత్ తన ఫామ్ హౌస్ లోనే గడపాలని అనుకున్నాడని.. కానీ ఎందుకో తన ప్లాన్స్ మార్చుకున్నాడని సుశాంత్ ఫామ్ హౌస్ మేనేజర్ చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.