Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందా…?

ఆ స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందా…?


did that star heroine got engaged

did that star heroine got engaged

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్ – ప్రొడ్యూసర్ దిల్ రాజు – దగ్గుబాటి రానా – నితిన్ పెళ్లి పీటలు ఎక్కేసారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మూడు పదుల వయసు దాటిపోయిన సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ ఒకరు పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకముందే ఈ హీరోయిన్ ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. వచ్చే ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి. అయితే ఈ వార్తలపై అమ్మడు స్పందించలేదు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీనియర్ బ్యూటీ స్పందిస్తూ ఏడాది కాలంగా తల్లి దండ్రులు తనను పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారని.. నన్ను బాగా చూసుకునేవాడు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి తనకు భర్తగా కావాలని చెప్పుకొచ్చింది.

కాగా ఇప్పుడు మరోసారి అమ్మడు పెళ్లి వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఆ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే జరిగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఆమె చెల్లెలు పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన నేపథ్యంలో పేరెంట్స్ ఆమెని కూడా పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టారట. దీంతో ఓ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఈ న్యూస్ మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడిందట. ఇప్పటికే చాలా సినిమాలు సైన్ చేసి ఉండటంతో.. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ విషయాన్ని బయటకి వెల్లడించొచ్చులే అనుకుందట. అయితే అమ్మడితో క్లోజ్ గా ఉండే ఓ యువ హీరో వల్ల ఈ న్యూస్ బయటకి పొక్కిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఆ హీరో అమ్మడి ఎంగేజ్మెంట్ కి వెళ్లి వచ్చి ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పాడట. దీంతో ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా పాకింది. మరి ఇప్పటికైనా ఈ వార్తలపై స్టార్ హీరోయిన్ స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.