Templates by BIGtheme NET
Home >> Cinema News >> సూపర్ స్టార్ మూవీలో లేడీ స్టార్

సూపర్ స్టార్ మూవీలో లేడీ స్టార్


జీరో సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబయిలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. షారుఖ్ దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకునే.. జాన్ అబ్రహంతో పాటు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ గా కనిపించబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు గాను ప్రముఖ నటి డింపుల్ కపాడియాను ఎంపిక చేశారని తెలుస్తోంది.

హాలీవుడ్ తాజా సెన్షేషనల్ మూవీ ‘టెంట్’ లో ఈమె నటించింది. బాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. లేడీ స్టార్ నటిగా పేరు దక్కించుకున్న ఈమె పఠాన్ సినిమాలో నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. షారుఖ్ ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. వార్ వంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అందించిన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.