Renu Desai: ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్’ మాజీ భార్య ‘రేణు దేశాయ్’ ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాలు చేశారు. అయితే, ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఆమెకున్న ఇమేజ్ గురించి తాజాగా ఓ సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఎవరు ఆయన..? ఆయనే సీనియర్ దర్శకుడు ‘గీతా కృష్ణ’. ఈయన గతంలో కోకిల, కీచురాళ్లు, సంకీర్తన లాంటి కొన్నిచిత్రాలు తీశారు. ప్రస్తుతం, బాగా ఖాళీగా ఉంటున్నాడేమో.. ఈ మధ్య వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఏదో హడావకుడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ క్రమంలో సంచలన కామెంట్లతో వార్తల్లో ఉండేందుకే యూట్యూబ్ లో పోటీ పడుతున్నాడు. రేణు దేశాయ్ గురించి కూడా ఈయన పెదవి దాటారు. అప్పట్లో ‘గీతా కృష్ణ’ తన కొత్త సినిమా కోసం ఓ హీరోయిన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ లేడీ మేనేజర్ ను పిలిచాడు. ఆమె కొన్ని ఫోటోలు పట్టుకొచ్చింది. ఆ ఫోటోల్లో చాలా మంది హీరోయిన్ల ఫొటోలు ఉన్నాయి.
కానీ, ‘గీతా కృష్ణ’కి ఓ అమ్మాయి ఫోటో మాత్రమే బాగా నచ్చింది. అది గమనించి ‘ఆ అమ్మాయి దానికి సరిగ్గా కోపరేట్ చేయదండి బాబు. అసలు ఆ అమ్మాయితో మనం పడలేం. పైగా చాలా ఇబ్బంది పెడుతుంది’ అంటూ పక్కన ఉన్న ఆ లేడీ మేనేజర్ చెప్పుకుంటూ పోతూ ఉంది. ‘ఈమె ఇలా ఎందుకు అంది ?’ అంటూ గీతా కృష్ణ ఆలోచనలో పడ్డారు. ఆ ఫోటోలో అమ్మాయి నెంబర్ తీసుకుని కాల్ చేసి, అఫీస్ కి రామ్మా అంటూ ఆహ్వానించాడు.
కట్ చేస్తే.. అదే రోజు సాయంత్రం ఆ అమ్మాయి ట్రెండీ డ్రెస్ లో చేతిలో బ్యాగ్ తో అఫీస్ లో అడుగు పెట్టింది. ఆ అమ్మాయే ‘రేణు దేశాయ్’. ‘గీతా కృష్ణ’ ఆమె వైపు చూసి పక్కన కుర్చీని చూపించాడు. ఆమె కూర్చుంది. ‘ఏంటమ్మా నీ పేరేంటి ?’. ‘రేణు దేశాయ్ అండి’ అంటూ హిందీలో సమాధానం వచ్చింది. ‘నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ?’ అంటూ అసలు విషయం చెప్పేశాడు ‘గీతా కృష్ణ’.
‘రేణు దేశాయ్’ సిగ్గు పడలేదు. అలాగే, బాధపడలేదు. అంతే దైర్యంగా ఉన్నది ఉన్నట్లు చెప్పింది. ‘నేను కమిట్‌మెంట్లు లాంటి వాటికి పూర్తిగా వ్యతిరేకం సర్’ అంటూ కుండబద్దలు కొట్టింది. రేణు దేశాయ్ అలా చెప్పడంతో గీతా కృష్ణ’ షాక్ అయ్యి, ఆమె వైపే అలాగే చూస్తూ నిలబడిపోయాడు. వెంటనే తేరుకుని, ‘నువ్వే నా సినిమాలో హీరోయిన్’ అంటూ ఆమెకు గీతా కృష్ణ అడ్వాన్స్ ఇచ్చారు. రేణుదేశాయ్ కమిట్‌మెంట్ ఇవ్వదు అంటూ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.