కొత్త ఏటీటీ.. డర్టీ హరి అందులో రానుందట

0

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో డిజిటల్ ప్లాట్ ఫామ్ రాబోతుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ రాగా త్వరలో కొత్తగా ప్రముఖ నిర్మాతలు ఏటీటీని ని తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే శ్రియాస్ ఈటీ ఏటీటీ ఉన్న విషయం తెల్సిందే. కొత్త ఏటీటీని డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించబోతున్నారట. ఏటీటీ ప్రారంభం కాకుండానే అప్పుడే సినిమాలను కొనుగోలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన డర్టీ హరి సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొత్త ఏటీటీ వారు కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు టాలీవుడ్ నుండి ప్రముఖులు వెనుకున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్లకు జనాలు తక్కువగా వస్తున్న సమయంలో ఏటీటీ(ఎనీ టైమ్ థియేటర్) కి ప్రాముఖ్యత పెరుగుతోంది. అందుకే ఏటీటీ లు వరుసగా రాబోతున్నాయి అంటున్నారు. తెలుగు నిర్మాతల నుండి వస్తున్న ఏటీటీ కారణంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు డిసెంబర్ 18న కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.

సినిమా ను బట్టి రేటు ఉంటుందని.. పే ఫర్ వ్యూ పద్దతికి ముందు ముందు మంచి ఆధరణ ఉంటుందని అంటున్నారు. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే విధానంను కొత్త ఏటీటీ వారు తీసుకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ లో ఈ ఏటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. డిసెంబర్ 18న అన్ని విషయాలు పూర్తి క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది.