Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మినీ ఫ్రాక్’తో గుండెలు లాక్ చేస్తున్న డిస్కో రాణి!!

‘మినీ ఫ్రాక్’తో గుండెలు లాక్ చేస్తున్న డిస్కో రాణి!!


నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని అనే పాట ఎంత మధురమైనదో.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆ వన్నెల దొరసాని నభా నటేష్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం.. క్యూట్ ఎక్సప్రెషన్స్.. అందమైన నటనతో ఫస్ట్ సినిమాతోనే కుర్ర హృదయాలకు గాలం వేసి తెలుగు స్టార్ హీరోల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ యంగ్ భామ.. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినా కూడా తెలుగులో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ.. వరుస సినిమాలతో ఇక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’లో అమ్మడి నటనతో పాటు అందాలు కూడా హైలైట్ అయ్యాయి. అమ్మడు డేర్ చూసి స్టార్ హీరోలు సైతం వారి సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు.

ఇక ఈ ఏడాది మాస్ రాజా రవితేజతో కలిసి డిస్కోరాజా సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం నభ సాయిధరమ్ తేజ్ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే కరోనా వ్యాప్తి చెందడంతో ఇప్పుడు లాక్ డౌన్ లో ఉంది. ఇక లాక్ డౌన్ లో ఖాళీగా ఉండకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వినోదం అందిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి విషయాలు షేర్ చేస్తూ.. కొత్త కొత్త లుక్స్ లో వేడెక్కించే ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇక తాజాగా అమ్మడు మినీ బ్లాక్ ఫ్రాక్ లో కవ్వించే ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అమ్మడి కైపెక్కించే థైస్ అందాలను చూస్తూ ఇంస్టాగ్రామ్ మొత్తం షేక్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ చాలా గ్యాప్ తర్వాత అదిరిపోయే పిక్ పోస్ట్ చేసావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.