శుభాకాంక్షలు చెప్పినందుకు రేప్ చేస్తామని షమీ భార్యకు బెదిరింపులు!

0

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మందిర నిర్మాణం భూమిపూజ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన అయోధ్యలో జరిగిన విషయం తెలిసిందే. శతాబ్దాల క్రితం పరదేశీయులు ఈ మందిరాన్ని కూల్చివేసి మరో కట్టడం నిర్మించారనేది చారిత్రక ఆధారాల్లో తేలింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత తిరిగి రామమందిర నిర్మాణ భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో క్రికెటర్ షమి భార్య మోడల్ హసీన్ జహాన్.. హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు.

హసీన్ జహాన్ శుభాకాంక్షలు తెలిపినందుకు కొంతమంది దారుణంగా ప్రవర్తించారట. తాను శుభాకాంక్షలు తెలిపినందుకు తనను కొందరు వేధిస్తున్నారని కోల్కతా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు నెటిజన్లు హద్దుమీరి మృగాల్లా కూడా ప్రవర్తించారట. కేవలం శుభాకాంక్షలు చెప్పినందుకు అత్యాచారం చేసి చంపేస్తామంటూ హెచ్చరికలతో కామెంట్స్ పెడుతున్నట్లు హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొంతమంది వల్ల తాను ఇబ్బందిపడుతున్నానని తనకు తన కూతురికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తాను నిస్సహాయరాలినని అభద్రతాభావం వెంటాడుతోందని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.అయోధ్యలో భూమిపూజ సందర్భంగా హిందూ సోదర సోదరీమణులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టగానే కొంతమంది తనను అసభ్యపదజాలంతో దూషించారని మరికొంత మంది రేప్ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది చాలా ఆందోళనకర విషయమని తాను కూతురితో ఒంటరిగా జీవిస్తున్నానని మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని హసీన్ జహాన్ విజ్ఞప్తి చేశారు.