వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

0

రామ్ గోపాల్ వర్మ తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో వరుసగా సినిమాలు తీస్తూ డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేస్తూ ఉన్న వర్మ తాజాగా ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను ప్రకటించాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన దిశ గ్యాంగ్ రేప్ ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నాడు. ఆరు నెలల క్రితమే వర్మ ఈ సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. అయితే ఇన్నాళ్లు అయినా అప్ డేట్ ఇవ్వక పోవడంతో వర్మ దిశ సినిమాను పక్కకు పెట్టాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎట్టకేలకు వర్మ నుండి ఆసినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ సెప్టెంబర్ 26న టీజర్ ను విడుదల చేస్తానంటూ పేర్కొన్నాడు. అలాగే సినిమాను నవంబర్ 26న విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. 2019 నవంబర్ 26న దిశ ఘటన జరిగింది. అందుకే అదే రోజు అంటే నవంబర్ 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వర్మ ఈ సినిమాను అయినా జెన్యూన్ గా తీస్తాడా లేదా రొమాంటిక్ యాంగిల్ అని కాంట్రవర్శీ కోసం అని కొత్త తన రొటీన్ సినిమాల మాదిరిగా తీస్తాడా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను అనురాగ్ కంచర్ల నిర్మిస్తు ఉండగా వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.