Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మకు షాకిచ్చిన దిశ తండ్రి నిందితుల కుటుంబం

వర్మకు షాకిచ్చిన దిశ తండ్రి నిందితుల కుటుంబం

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. తెలంగాణలో జరిగిన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే..! దీని ఆధారంగానే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్.. ట్రైలర్ విడుదలై సంచలనంగా మారాయి.

దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.

ఇక వర్మ చిత్రాన్ని నిలిపివేయాలని దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యూడీషియల్ కమిషన్ ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సూచనతో దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటంబసభ్యులు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వర్మ దిశ చిత్రంలో తమ వాళ్లను విలన్స్ గా చూపెడుతూ.. చెడుగా చూపిస్తాడని కమిటీకి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వాపోయారు. చిత్రాన్ని నిలిపివేయాలని కోరారు.

కాగా దిశ తండ్రి అభ్యంతరాల నేపథ్యంతో ‘దిశ’ మూవీ కూడా ఆగిపోతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎవరినీ అంతగా లెక్కచేయకుండా తనపని తాను చేసుకుపోయే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని తన యూట్యూబ్లో విడుదల చేయడం ఖాయమని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. తెలంగాణలో జరిగిన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే..! దీని ఆధారంగానే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్.. ట్రైలర్ విడుదలై సంచలనంగా మారాయి.

దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.

ఇక వర్మ చిత్రాన్ని నిలిపివేయాలని దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యూడీషియల్ కమిషన్ ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సూచనతో దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటంబసభ్యులు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వర్మ దిశ చిత్రంలో తమ వాళ్లను విలన్స్ గా చూపెడుతూ.. చెడుగా చూపిస్తాడని కమిటీకి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యుల హక్కులకు భంగం కలుగుతోందని వాపోయారు. చిత్రాన్ని నిలిపివేయాలని కోరారు.

కాగా దిశ తండ్రి అభ్యంతరాల నేపథ్యంతో ‘దిశ’ మూవీ కూడా ఆగిపోతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎవరినీ అంతగా లెక్కచేయకుండా తనపని తాను చేసుకుపోయే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని తన యూట్యూబ్లో విడుదల చేయడం ఖాయమని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.