అప్పుడు నా గుండె పగిలింది : పూజా హెగ్డే

0

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కను వినిపించే పేర్లలో ముందు వరుసలో పూజా హెగ్డే పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలకు యంగ్ హీరోలకు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రభాస్ తో ప్రస్తుతం ఈమె చేస్తున్న రాధేశ్యామ్ విడుదలైతే మరింత పాపులారిటీ దక్కించుకోవడం ఖాయం. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ఆమద్య హౌస్ ఫుల్ 4 సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పింది. అయితే కరోనా కారణంగా ఈమె హిందీ ప్రాజెక్ట్ లు ఏవీ కూడా పట్టాలెక్కలేదు.

పూజా హెగ్డేకు టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా పేరున్నా కూడా హిందీపై ఈమెకు అమితమైన ప్రేమ ఉన్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత హిందీలో మొహంజదారో సినిమాలో ఈ అమ్మడు నటించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కోసం ఈమె ఏకంగా ఏడాది పాటు కష్టపడింది. తెలుగు సినిమాలకు దాదాపు రెండేళ్ల పాటు దూరంగా ఉండటంకు ఆ సినిమానే కారణం. అంత కష్టపడ్డ ఆ సినిమా నిరాశ పర్చింది.

మొహంజదారో సినిమా ప్లాప్ అవ్వడం జీవితంలో పెద్ద చేదు సంఘటనగా అభివర్ణించింది. ఆ సినిమా నిరాశ పర్చిన సమయంలో నా గుండె పగిలింది. ఆ సినిమా ప్లాప్ తో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నాను. కాని అదృష్టం కొద్ది సౌత్ నుండి ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్లతో మళ్లీ పుంజుకున్నాను. హిందీలో మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఇక్కడ సినిమాలు చేసేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా పూజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె రాధేశ్యామ్ తో పాటు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మరియు హిందీలో ఒక సినిమాను చేస్తోంది. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.