ఎల్లో బికినీలో ఎల్లోరా శిల్పం

0

తెలుగు సినిమా ‘లోఫర్’ తో హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ దిశా పటాని ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. లోఫర్ వచ్చి అయిదు ఏళ్లు అవుతుంది. అప్పటి నుండి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. అక్కడ మెల్ల మెల్లగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటుంది. తన అందంతో పాటు అభినయంతో మెప్పిస్తున్న దిశా పటాని బికినీ విషయంలో మొహమాటం అనేది లేకుండా సినిమాల్లో వేస్తుంది. ఈమద్య కాలంలో సినిమాల్లో బికినీ వేసేందుకు అవకాశం రాకపోవడంతో సోషల్ మీడియా ద్వారా తన బికినీ షో ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ను పెడుతూనే ఉండే దిశా పటానీ ఈసారి ఎల్లో బికినీలో కనిపించింది. ఈ అమ్మడు ఎల్లో బికినీ ప్రస్తుతం సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. ప్రియుడితో భాగీ సినిమాలో నటించడంతో ఈ అమ్మడి స్టార్ డం మరింతగా పెరిగింది. వరుసగా సినిమాలు వస్తున్న సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా మొత్తం ఆగిపోయింది. ప్రస్తుతం ఈమె రెండు సినిమాలు చేస్తోంది. ఆ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా కన్ఫర్మ్ చేసి వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.