Templates by BIGtheme NET
Home >> Cinema News >> బికినీ షోలు చేస్తున్నా అమ్మడికి ఆఫర్స్ మాత్రం రావడం లేదే..!

బికినీ షోలు చేస్తున్నా అమ్మడికి ఆఫర్స్ మాత్రం రావడం లేదే..!


బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలీ ఏదొక ఫోటోనో వీడియోనో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కుర్రకారుకి వేడి పుట్టించే దుస్తుల్లో మెరుపులు మెరిపించే దిశా.. ఈ మధ్య బికినీ షో తో అదరగొడుతోంది. రోజుకో బికినీ వేసుకొని ఫ్యాన్స్ కి కనువిందు చేస్తూనే ఉంది. అయితే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి అటు బాలీవుడ్ లో కానీ.. ఇటు సౌత్ లో కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదని తెలుస్తోంది. ఈ మధ్య ఎందుకో ఈ బ్యూటీని ఐటమ్ సాంగ్స్ కి తప్పితే ఫుల్ లెంత్ రోల్స్ కి తీసుకోవడానికి ఫిలిం మేకర్స్ ఎవరూ ముందుకు రావడం లేదని బాలీవుడ్ కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.

దిశా పటాని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత అమ్మడు నటించే సినిమాపై క్లారిటీ లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది దిశా. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. మొదట్లో స్టార్ హీరోల పక్కన్న ఛాన్సులు దక్కించుకుంది. ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ ‘కుంఫు యోగా’ ‘భారత్’ ‘భాగీ 2’ ‘మలంగ్’ వంటి సినిమాలలో నటించింది. అలానే పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి అలరించింది. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో దిశా బికినీ లతో రచ్చ చేస్తున్నా ఐటమ్ సాంగ్స్ తప్ప సినిమా ఆఫర్స్ రావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.