Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంపూ.. భారీ ఫైట్లు – వినూత్న డ్యాన్సులు అస్సలు తగ్గట్లేదు..!

సంపూ.. భారీ ఫైట్లు – వినూత్న డ్యాన్సులు అస్సలు తగ్గట్లేదు..!


బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తెలుగు సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. సెటైరిక్గా కూడా సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించారు. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేశారు. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఆయన నటించిన ‘హృదయకాలేయం’ ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలు మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ చిత్రాల తర్వాత సంపూర్ణేశ్కు కూడా ఓ మార్కెట్ ఏర్పడింది. యూట్యూబ్లోనూ ఆయన సినిమాలకు భారీ వ్యూస్ వస్తుంటాయి. ఆయన ఇంటర్వ్యూలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ ‘ బజార్రౌడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వసంత నాగేశ్వర్రావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేశ్కు జోడీగా మహి నటిస్తోంది.

షాయాజీ షిండే 30 ఇయర్స్ పృథ్వీ నాగినీడు షఫి జీవా సమీర్ మణిచందన నవీన పద్మావతి కత్తి మహేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూరుస్తున్నారు.ప్రస్తుతం ఆయన నేతృత్వంలో పాటలను చిత్రీకరిస్తున్నారు.

తెలుగు సినిమాల్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రామ్ వంటి సూపర్ డ్యాన్సర్లకు స్టెప్ లు కంపోజ్ చేసే ప్రేమ్ రక్షిత్ సంపూర్ణేష్ సినిమాకు పని చేయడం విశేషమే.

ప్రస్తుతం రామోజీఫిల్మ్సిటీలో ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో దాదాపు 20 మంది డాన్సర్లతో కలిసి సంపూర్ణేశ్ బాబు హీరోయిన్ మహితో స్టెప్పులు వేస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. మా నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిగతా టీం కూడా ఎంతో ప్లాన్తో షెడ్యూల్ వేసుకొని సినిమా తీస్తున్నాం. అతి తర్వలో ఫస్ట్లుక్ టీజర్ రిలీజ్ చేస్తాం. మరుధూరి రాజా సంభాషణలు బుల్లెట్లలా ఉన్నాయి.’ అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.