నీ అందం ముందు అలలు చిన్నబోతున్నాయి

0

బిగ్ బాస్ కు ముందు దివి పెద్దగా ఎవరికి తెలియదు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఫిజికల్ టాస్క్ ల విషయంలో పెద్దగా కష్టపడకుండా స్మూత్ గా ముందుకు వెళ్లి 50 రోజుల వరకు ఉన్న దివి దసరా సందర్బంగా ప్రత్యేకంగా సమంత గెస్ట్ హోస్టింగ్ చేసిన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది. హీరోయిన్ అవ్వాలని కోరిక ఉందన్నదివి అందుకు తగ్గట్లుగా అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ కంటే బెటర్ గా దివి ఉంటుందనేది ఆమె అభిమానుల అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇటీవల ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా బీచ్ లో డాన్స్ చేస్తూ దివి కనిపించింది. వైట్ డ్రస్ లో మెరిసి పోయిన దివి నడుము అందం చూపిస్తూ చేసిన డాన్స్ కు అలలు కూడా చిన్న బోయి వెనక్కు పోయినట్లుగా అనిపిస్తుంది అంటూ దివి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దివి స్లో మోషన్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమెకు నటిగా కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే అన్నింటికి కమిట్ కాకుండా మెల్లగా సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)