మాల్దీవుల్లో అగ్గి రాజేసిన బిగ్ బాస్ బ్యూటీ

0

బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్ పరిచయం అవసరం లేదు. తనదైన అందం హట్ నెస్ తో యువతరాన్ని ఓ ఊపు ఊపిన ఈ భామ తాజాగా విహారయాత్ర కోసం మాల్దీవుల్లోకి అడుగుపెట్టింది. అక్కడి నుండి నిరంతరం తన అద్భుతమైన చిత్రాలను పోస్ట్ చేస్తోంది. డిజైనర్ కఫ్తాన్ డ్రెస్ నుండి లాసీ దుస్తులు వరకు…ఎవ్వెరి మినిట్ ట్రీట్ అభిమానులకు సిద్ధం చేస్తోంది.

తాజాగా హీనా ఖాన్ పింక్ బికినీ ఫోటోల్ని పోస్ట్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. నేపథ్యంలో బ్లూ సీ ఆ సున్నితమైన భంగిమకు మరింత అందం తెచ్చింది. ఓవైపు సూర్యుని ఎండ ఆకాశాన్ని తాకుతుంటే.. సన్ కిస్డ్ బేబీగా హీనా ఆ ఎండలోనే నించుని ఫోజులిచ్చింది. ఆమె తన పోస్ట్ కు క్యాప్షన్ ఇవ్వలేదు. ఫోటోనే మాట్లాడుతుంది అంటూ లైట్ తీస్కుంది.

ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ఎలా స్పందించారు? అంటే.. హీనా ఖాన్ తన చిత్రాన్ని పోస్ట్ చేసిన వెంటనే ఆమె అభిమానులు స్నేహితులు చాలా మంది హీనాపై వ్యాఖ్యానించారు. అరియా అగర్వాల్ ప్రియాంక ఉధ్వానీ గుండె ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు.

హినా ఖాన్ ఇంతకు ముందు పోస్ట్ చేసిన మరికొన్ని చిత్రాలలో బీచ్ గాలుల్ని ఆస్వాధిస్తూ స్పెషల్ బీచ్ డిజైనర్ దుస్తులలో కనిపించింది. ఆమె తన ప్రతి స్టైలిష్ దుస్తులలో పిక్చర్-పర్ఫెక్ట్ గా కనిపించింది ఆమె ఫ్యాషన్ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. ఇటీవల బీచ్ లో రంగురంగుల కఫ్తాన్ దుస్తులు ధరించిన చిత్రాల శ్రేణిని పంచుకుంది. దానితో పాటు ఆమె సాధారణం ఫ్లిప్ ఫ్లాప్స్ పింక్ హెడ్ బ్యాండ్ ధరించి కనిపించింది.

టీవీ కార్యక్రమం `యే రిష్టా క్యా కెహ్లతా హై`తో హీనా తన కెరీర్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె బిగ్ బాస్ 11 లో కూడా కనిపించింది. అలాగే `హ్యాక్డ్` అనే బాలీవుడ్ చిత్రం కూడా చేసింది. రియాలిటీ షో యొక్క 14 వ సీజన్లో హినా ఖాన్ బిగ్ బాస్ ఇంట్లో టూఫానీ సీనియర్ గా తిరిగి ప్రవేశించారు. ఇంతలో ఆమె మ్యూజిక్ వీడియో హమ్కో తుమ్ మిల్ గయే కూడా ఇటీవల విడుదలైంది.

హినా ఖాన్ ఇటీవలే స్టైల్ ఐకాన్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ 2020 (మహిళా) స్టైల్ ఐకాన్ ఆఫ్ సోషల్ మీడియా 2020 (మహిళా) అవార్డులతో సత్కరించారు. నటి దాదాసాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డ్స్ ఫిల్మ్స్ 2020 లో బహుమతి కూడా గెలుచుకుంది.