స్టార్ హీరో మూవీలో ఛాన్స్ పొందిన నెట్ ఫ్లిక్స్ బ్యూటీ

0

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన లవ్ పర్ స్క్వేర్ ఫుట్ తో ముద్దుగుమ్మ అంగిరా ధార్ కు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కింది. మెగాస్టార్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తూ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మే డే’ సినిమాలో ఎంపిక అయ్యింది. ఈమె ఆ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటిస్తున్నా కూడా ఈమెకు ఈ క్రేజీ మూవీలో ఛాన్స్ రావడంతో ఆమె కెరీర్ అనూహ్యంగా టర్న్ అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాకు అజయ్ దేవగన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించడంతో పాటు సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇద్దరు స్టార్ లు అది కాకుండా ఒక స్టార్ డైరెక్షన్ మరియు నిర్మాత అవ్వడంతో ‘మేడే’ సినిమాకు ఉన్న హైప్ భారీగా పెరిగింది. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా తో అంగిరా ధార్ ఖచ్చితంగా బాలీవుడ్ లో స్టార్ గా మారడం ఖాయం అనిపిస్తుంది.