సీడెడ్ నుంచి ఆంధ్రా మీదకు మళ్ళిన యూవీ డిస్ట్రిబ్యూషన్..?

0

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వరుసగా విజవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఒకవైపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న యూవీ టీమ్.. సీడెడ్ ఏరియాలో సినిమాలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు యూవీ డిస్ట్రీబ్యూషన్ ఆంధ్రా ఏరియా వైపు మళ్లిందట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆంధ్ర ఏరియాలో యూవీ టీమ్ పంపిణీ చేస్తోందని సమాచారం.

కాగా గత కొన్ని నెలలుగా మూతబడి పోయిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా థియేటర్స్ మూతపడిపోయి.. సినిమాలు రిలీజ్ అవకపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాలు చవిచూసింది. సినిమా రిలీజులు లేకపోవడంతో థియేటర్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. సినిమా థియేటర్స్ తెరుస్తున్నప్పటికి 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా ప్రదర్శించాలనే కండిషన్ పెట్టారు. దీంతో ఇప్పుడు విడుదలయ్యే కొత్త సినిమాలకి రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిజల్ట్ ని బట్టి ఇండస్ట్రీలో చాలా మూవీస్ థియేట్రికల్ రిలీజ్ కి ముందుకొచ్చే అవకాశం ఉంది.