‘సర్కారు వారి పాట’లో మహేష్ తండ్రి ఎవరో తెలుసా?

0

మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. తన తండ్రిని మోసం చేసిన వాళ్ల అంతు చూసే కొడుకుగా మహేష్ నటిస్తున్నారని సమాచారం. అయితే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఫాదర్ క్యారెక్టర్లో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచించి జయరామ్ ను ఫైనల్ చేశారట.

మలయాళ సీనియర్ నటుడైన జయరామ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతేడాడి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి రామచంద్రగా నటించారు. ఆ సినిమాలో జయరామ్ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో.. ‘సర్కారు వారి పాట’లోనూ ఆయన్నే ఫాదర్ క్యారెక్టర్ కు తీసుకున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్నారట.

మొత్తానికి టాలీవుడ్ మేకర్స్ కు మంచి ఆప్షన్ గా మారిపోతున్నాడు జయరామ్. అంతేకాకుండా.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అనుకున్నప్పుడు మలయాళం ఆడియన్స్ ను కవర్ చేసేందుకు కూడా జయరామ్ ఉపయోగపడతారని భావిస్తున్నట్టున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు జయరామ్. మరి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారనే ప్రచారంలో ఎంత వరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.