డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సహా మరో 25 మంది పేర్లు బయటపెట్టిన రియా!

0

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు బాలీవుడ్‌తో సహా సౌత్ ఇండియన్ సినీ వర్గాలను సైతం వణికిస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్‌లో ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది.

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఒక్కొక్కటిగా ఆమె రివీల్ చేస్తున్న విషయాలు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు తెలిసింది.

అయితే తాజాగా పలు జాతీయ మీడియాల్లో షికారు చేస్తున్న వార్తల సారాంశం మేరకు డ్రగ్స్ మాఫియాతో మేజర్‌గా డీలింగ్స్ ఉన్న వారిలో బాలీవుడ్ భామలు సారా అలీ ఖాన్‌, సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో వణుకు పుట్టింది. ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి ఈ ముగ్గురి పేర్లు బయటపెట్టిందని సమాచారం.

రకుల్ ప్రీత్‌‌కు రియాకు మధ్య మంచి స్నేహం ఉందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్న ఈ తరుణంలో డ్రగ్స్ రాకెట్‌లో అమ్మడి పేరు బయటపడటం హాట్ టాపిక్ కావడమే గాక జనాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. సో.. చూడాలి మరి దీనిపై రకుల్ నుంచి గానే సారా నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది.