Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘డంకీ’15 వ‌య‌సు పైబ‌డిన వారికే..!

‘డంకీ’15 వ‌య‌సు పైబ‌డిన వారికే..!


ఈ క్రిస్మ‌స్ సీజ‌న్ లో ఇద్ద‌రు పాన్ ఇండియా స్టార్ల న‌డుమ తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డంకీ డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఆ మ‌రునాడే, అంటే 22న ప్ర‌భాస్ స‌లార్ అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ఈ రెండు సినిమాల న‌డుమ క్లాష్ వ‌ల్ల‌ ఓపోనింగుల షేరింగ్ త‌ప్ప‌డం లేదు. అయినా యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమా స‌లార్ కి భారీ ఓపెనింగులు ద‌క్కుతుండ‌డంపై హిందీ ట్రేడ్ లో వితండ‌వాదం సాగుతోంది.

అదంతా అటుంచితే షారూఖ్ ఖాన్ సినిమా డంకీ కేవ‌లం 15 ఏళ్లు అంత‌కుమించిన వ‌య‌సు ఉన్న వారు మాత్ర‌మే థియేట‌ర్ల‌లో వీక్షించేందుకు వెసులుబాటు ఉంది. పెచ్చుమీరిన‌ హింస, యాక్షన్ కంటెంట్ కారణంగా బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ అయిన BBFC 15 + రేటింగ్ ఇచ్చింది. దీన‌ర్థం 15 వ‌య‌సు మించిన వారికి మాత్ర‌మే ఈ సినిమా. హింస‌, ర‌క్త‌పాతం కార‌ణంగా సలార్ 18+ రేటింగ్ పొందిన సంగ‌తి తెలిసిందే. స‌లార్ తో పోలిస్తే ఇప్పుడు డంకీని కూడా హింస విద్వేషం ప‌రంగా త‌క్కువ‌గా చూడ‌లేని ప‌రిస్థితి ఉంది.

డంకీ న‌లుగురు వ‌ల‌స‌దారుల క‌థ‌. పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన నలుగురు స్నేహితుల కథ, వీసా లేకుండా ఇంగ్లండ్‌కు ప్రయాణమయ్యాక ఏం జ‌రిగింద‌నేది ఈ సినిమా. కామెడీ డ్రామాలో హింస‌, ర‌క్త‌పాతం, కలతపెట్టే సన్నివేశాలు, వివక్ష కూడా ఉంటాయి. తుపాకీ బెదిరింపులు, వివక్ష, లైంగిక హింస ఉంది. మ‌గువ‌ల‌పై బ‌లాత్కారాలు క‌ల‌వ‌ర‌పెట్టేవిగా ఉన్నాయిని BBFC ప్రేక్షకులకు సూచించింది. హిరాణీ ఈ చిత్రాన్ని సెన్సిటివ్ కంటెంట్ తో రూపొందించారు. ఈ సినిమాని వీక్షించిన కొంద‌రు బాలీవుడ్ నిపుణులు సోష‌ల్ మీడియాల్లో రేటింగులు ఇస్తున్నారు. అయితే వాస్త‌వంగా ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే మ‌రో రోజు ఆగాల్సిందే.