ఈమెకు ముద్దు పెట్టబోయిన ఆ హీరో ఎవరబ్బా..?

0

ఈమద్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. వారితో ఛాటింగ్ చేయడంతో పాటు రెగ్యులర్ గా వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మరింత మంది ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉన్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా అభిమానులతో రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఆమె తాజాగా ఒక లైవ్ చాట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు ఒక నటుడు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా వారించాను అంది.

షూటింగ్ లో భాగంగా అతడు తనకు ముద్దు పెట్టాలనుకున్నాడు. కాని అతడికి ఒప్పుకోలేదు అంటూ చెప్పిన ఈషా ఆ నటుడు ఎవరు అనే విషయంను మాత్రం చెప్పలేదు. ఇంతకు ఈమెకు ముద్దు పెట్టాలనుకున్న ఆ నటుడు ఎవరై ఉంటారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పలువురు నెటిజన్స్ ఆమెను ఇదే ప్రశ్న వేశారు. మీకు ముద్దు పెట్టాలనుకున్నది ఎవరు అంటూ కామెంట్స్ చేయగా ఆమె మాత్రం స్పందించలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్ హీరోల సరసన నటించాలని తాపత్రయ పడుతోంది. మరి ఈమెకు ఆ ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి.