సూపర్ స్టార్ ట్వీట్ నే ట్రోల్ చేసింది

0

బాలీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గాంధీ జయంతి సందర్బంగా అందరిని ఆకట్టుకునేలా ఒక మంచి విషయాన్ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలను చెడు చూడనివ్వకండి.. చెడు మాట్లాడనివ్వకండి.. చెడును విననివ్వకండి అంటూ గాంధీజీ మూడు సూత్రాలను అన్వయిస్తూ పిల్లల విషయంలో వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్బంగా షారుఖ్ ఖాన్ చేసిన పోస్ట్ ను అంతా అభినందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆయన ట్వీట్ ను ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ సమయంలో అంతా నోరు.. చెవులు.. కళ్లు మూసుకుని ఉంటే దేశంలో జరుగుతున్న అన్యాయాలు అఘాయిత్యాల గురించి ఎవరికి అయినా ఎలా తెలుస్తుంది. వాటి గురించి మాట్లాడాల్సిన బాధ్యతల లేదా అంటూ నటి సయాని గుప్తా విమర్శలు చేసింది.

పిల్లలకు మంచి విషయాలు భోదించమని గాంధీ గారు చెప్పారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళితుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ కళ్లను నోటిని మూసుకోకండి సత్యం మరియు ధర్మం కోసం మాట్లాడండి అంటూ షారుఖ్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షారుఖ్ ఖాన్ ను అంత డైరెక్ట్ గా విమర్శించడం అంటే మామూలు విషయం కాదు. ఒక నటి ఆయన్ను ఇలా ట్రోల్ చేయడం కూడా విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కొందరు ఆమె తీరుకు అవాక్కవుతున్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి మీలాంటి స్టార్స్ అయినా స్పందించాలి అనేది ఆమె అభిప్రాయం అయ్యి ఉంటుందని షారుఖ్ ఖాన్ పోస్ట్ కు మరికొందరు కామెంట్ పెడుతున్నారు.