ఎన్టీఆర్ ఫ్యాన్స్ దసరాకు రాసి పెట్టుకోండి

0

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మెగా మరియు నందమూరి అభిమానులు కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. జక్కన్న సినిమా అంటే సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి మరియు ఎన్టీఆర్ కొమురం భీం అంటూ ఇప్పటికే ప్రకటన వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఇస్తూ సినిమాను తెరకెక్కిస్తానంటూ రాజమౌళి మొదట్లోనే మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెల్సిందే. కాని ఎన్టీఆర్ విషయంలో జక్కన్న కాస్త ఇబ్బంది పడ్డాడు.

కరోనా ఆరంభం సమయంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన లుక్ ను మరియు వీడియోను విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఆ వీడియోను విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రావాల్సిన వీడియో కరోరా కారణంగా నిలిచి పోయింది. అప్పటి నుండి కూడా ఎన్టీఆర్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు అయిదు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎదురు చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి ఈ నెలలో వారి కోరికను తీర్చబోతున్నాడు. దసరా కానుకగా ఎన్టీఆర్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా ఎన్టీఆర్ ప్రోమోకు సంబంధించిన చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఖచ్చితంగా దసరాకు ఎంటర్ టైన్ అవ్వడం ఖాయం అంటూ ఆర్ఆర్ఆర్ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.