హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ అంటూ..!

0

మహమ్మారీ విలయం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన నెలకొంది. ఇక ఇలాంటి పరిస్థితిలో అన్ లాక్ 5.0 అంటూ ఉన్న నియమనిబంధనలు కూడా సడలించడంతో విజృంభణ మరింత ఎక్కువ అవుతోందన్న ఆందోళన నెలకొంది. ఇటీవల షూటింగులకు పూర్తి స్థాయి అనుమతులు రావడం అనంతరం సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆన్ లొకేషన్ కి వెళ్లి షూటింగుల్లో పాల్గొనడం తెలిసినదే. అమితాబ్.. ఐశ్వర్యారాయ్.. ఆరాధ్య.. రాజమౌళి.. ఎస్పీబీ సహా పలువురు స్టార్లకు కరోనా సోకింది.

తాజాగా అందాల కథానాయిక తమన్నాకు కరోనా సోకిందని ప్రచారమవుతోంది. అధిక జ్వరంతో తమన్నా బాధపడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారని సమాచారం. ల్యాబ్ టెస్టుల అనంతరం పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇదివరకూ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. అనంతరం చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. ఇప్పుడు తమన్నా షూటింగుల కోసం బయటికి రావడంతో తనకు కూడా ఈ వ్యాధి సోకింది. ప్రస్తుతం గోపిచంద్ సరసన సిటీమార్ లో నటిస్తున్న తమన్నా.. అంధధూన్ రీమేక్ తో పాటు శీతాకాలం అనే చిత్రంలో నటిస్తోంది. ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసినదే.