ఏంటమ్మాయ్ .. హీట్ పుట్టిస్తూ ప్రమోషనా?

0

ఈషా రెబ్బా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. అందాల పోటీల నుంచి నేరుగా సినీప్రపంచంలో అడుగు పెట్టి సత్తా చాటుతోంది. కథానాయికగా నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో అవకాశాలు అందుకుంటోంది. 2020 లో ఈ అమ్మడు ఫుల్ బిజీగానే ఉంది. తమిళం లో ఆయిరామ్ జెన్మగల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇంకా విడుదల చేయని ఎస్.ఆర్.కె ఫిల్మ్స్ తో కన్నడ రంగంలో అడుగు పెడుతోంది. అక్కడ తొలి చిత్రమిదే. అలాగే అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఈషా పాత్ర కు చక్కని గుర్తింపు దక్కనుందిట.

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో సెల్ఫీ ప్రమోషన్ సహా వేడెక్కించే ఫోటోషూట్లతో టచ్ లో ఉంది. తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్ధం మూవీ ట్రైలర్ లో మాధవన్ ని వీక్షిస్తూ ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసింది. ప్రమోషన్ మాటేమో కానీ ఈషా థై షోస్ తో హీటెక్కించడంపై బోయ్స్ ఒకటే డిస్కషన్ స్టార్ట్ చేసారు.

తాజా ఫోటోతో పాటు ఇషా ప్రచారం ఆసక్తికరం. “దీన్ని పోస్ట్ చేయకుండా నేను ఆపలేను! నేను #NishabdhamOnPrime ట్రైలర్ ను ఇప్పటికే చాలాసార్లు చూశాను. ఎంతో బావుంది. నేపథ్య సంగీతం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎంచుకున్న కళా ప్రక్రియకు ఖచ్చితంగా సూటైంది. ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్లు ఎంతో ఉత్సాహం పెంచేవారు. ఓరి దేవుడా! మ్యాడీ- అనుష్క కలిసి స్క్రీన్ ను రంజింప చేయడం అందరికీ ఒక ట్రీట్ అవుతుంది. 2 అక్టోబర్ టైమ్ లాక్ చేయండి“ అంటూ ఈష ప్రచారం చేసింది. మొత్తానికి నిశ్శబ్ధం ప్రమోషన్ తో పాటు ఈష ప్రమోషన్ కూడా అదిరిపోయింది అంటూ యూత్ ఒకటే గుసగుసలాడేసుకోవడం విశేషం.