ఇటలీకి పయనమైన యంగ్ రెబల్ స్టార్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ”రాధేశ్యామ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణా మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్.. తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని దర్శకుడు ప్రకటించినప్పటికీ.. ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్ కి పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో ”రాధేశ్యామ్” టీమ్ ఇటలీకి పయనమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో డార్లింగ్ ప్రభాస్ దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటలీలో 15 రోజుల షెడ్యూల్ ను జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య కీలకమైన కీలక సన్నివేశాలను మరియు ఓ పాటను చిత్రీకరించనున్నారని సమాచారం. షూటింగ్ ముగించుకుని అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే ప్రభాస్ – పూజాహెగ్డే బర్త్ డేలు అక్టోబర్ నెలలోనే ఉండటంతో.. సెలబ్రేషన్స్ అక్కడే జరిగే అవకాశం ఉంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ‘రాధే శ్యామ్’పై భారీ అంచనాలే ఉన్నాయి.