గ్రీకు సుందరి ఏం చేసినా సంచలనమే

0

హిందీ చిత్రసీమకు ఎల్లీ అవ్ రామ్ పరిచయం అవసరం లేదు. గొప్ప నర్తకిగా సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ పశ్చిమదేశ సుందరి. ఇటీవల చెలరేగి వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.

అవి అంతర్జాలాన్ని ఓ రేంజులో అట్టుడికిస్తున్నాయి. 30 ఏళ్ల ఈ స్వీడిష్ గ్రీకు సుందరి ఏం చేసినా సంచలనంగా మారింది. ఇంతకుముందు మాల్దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు నెట్ ని షేక్ చేశాయి.

ఇప్పటికీ ఆ జ్ఞాపకాల్ని విడువడం లేదు. అడపాదడపా బీచ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోల్ని అభిమానులకు షేర్ చేస్తూ హీట్ పెంచేస్తోంది. తాజాగా ఎల్లీ అవ్ రామ్ షేర్ చేసిన కొత్త ఫోటోలు మరోసారి బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. బీచ్ లో సర్కిల్ ని తలపిస్తున్న బెంచ్ లో కూచుని ఫోజిచ్చిందిలా.. టూర్ ముగిసింది కాబట్టి తదుపరి బాలీవుడ్ సినిమాలపైనా ఎల్లీ దృష్టి సారిస్తోంది. మరోవైపు టీవీ రియాలిటీ షోలతోనూ ఈ అమ్మడు బిజీ కానుంది. జాన్వీ నటిస్తున్న రూహీ అఫ్జానా చిత్రంలో ఎల్లీ అదిరిపోయే ఐటెమ్ నంబర్ లో నర్తిస్తోంది. ఆ మూవీకే అది హైలైట్ గా ఉండనుందిట.