డిసెంబర్ నుంచి కోబ్రా షూటింగ్ స్పీడ్

0

ప్రయోగాల హీరోగా చియాన్ విక్రమ్ కి గుర్తింపు ఉంది. అతడు నటిస్తున్న తాజా సినిమా కోబ్రా. ఇదివరకూ రిలీజైన టైటిల్ లుక్ కి అద్భుత స్పందన దక్కింది. కోబ్రా ఫస్ట్ లుక్ అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది. విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడని అర్థమైంది.

కోబ్రా టైటిల్ కి తగ్గట్టే విక్రమ్ ఏడు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారని సమాచారం. కోబ్రా ఏడు గెటప్పులపైనా ఇటీవల చర్చ సాగింది. శాస్త్రవేత్త- ప్రొఫెసర్- రాజకీయనాయకుడు- మతబోధకుడు- కార్పొరెట్ వోనర్.. ఇలా ఏడు రూపాలు దేనికదే స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

ఇక ఇందులో భీకరాకారంతో కండలు మెలితిరిగిన రూపం సినిమా ఆద్యంతం కథను నడిపించనుందిట. ఇటీవల ఈ సినిమాలో విక్రమ్ ఏడు రూపాల్లో కాదు మొత్తం 20 రూపాల్లో కనిపించి షాకిస్తాడని కూడా ప్రచారమైంది.

దశావతారంలో కమల్ హాసన్ 10 రూపాల్లో కనిపిస్తేనే అభిమానులు థ్రిల్లయ్యారు. ఇప్పుడు చియాన్ ఫ్యాన్స్ పూర్తి ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళం- తెలుగు- హిందీ సహా పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి కథానాయిక. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రధారి. స్వరమాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. కరోనా మహమ్మారీ ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ వేసింది. రష్యా లాంటి చోట్ల తీయాల్సిన సీన్స్ ని ఇప్పుడు ఇండియాలోనే పూర్తి చేస్తున్నారట. ఈ డిసెంబర్ నుంచి కోబ్రా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతోందని తెలిసింది. విక్రమ్ – నిధి సహా అగ్ర తారాగణం ఈసారి షూటింగులో పాల్గొననుందని తెలిసింది.