ఎఫ్3కి అంతా రెఢీ.. ముహుర్తం కూడా డిసైడ్ చేశారు

0

కొన్ని కాంబినేషన్లు అదరగొట్టేస్తాయి. మామూలు సినిమానే అయినా మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తాయి. ఆ కోవకు చెందిందే ఎఫ్ 2. చిత్రమైన పేరును టైటిల్ గా ఫిక్స్ చేసి.. అంచనాలకు మించిన ఫలితాన్ని సాధించిన ఈ చిత్రం బాక్స్ ఫీసు దగ్గర ఎంతలా సందడి చేసిందో తెలిసిందే. తెలుగులో మల్టీస్టారర్ ఫిలింలు తక్కువన్న అపవాదుకు చెక్ చెబుతూ.. ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు మక్కువ చూపుతారు వెంకటేశ్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2లో వెంకీ.. వరుణ్ తేజ్ ల కాంబినేషన్ అదిరిపోవటమే కాదు.. చక్కటి విజయాన్ని ఇచ్చింది. తాజాగా ఇదే కాంబినేషన్ లో ఎఫ్2కు సీక్వెల్ మీద చాలానే చర్చ జరిగింది.తాజాగా స్క్రిప్టు వర్కు పూర్తి కావటమే కాదు.. ఫైనల్ గా సెట్ల మీదకు వెళ్లేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఎఫ్ 2 మేజిక్ ను మరోసారి రిపీట్ చేసేందుకు అనిల్ రావిపూడి బాగానే కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.

ఫైనల్ స్క్రిప్టుకు వెంకీ.. వరుణ్ తేజ్ లు ఓకే చెప్పారు. డిసెంబరు 14న ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. మొదటి షెడ్యూల్ లోఈ ఇరువురు అగ్ర నటులు పాల్గొంటారని చెబుతన్నారు. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే మేలో థియేటర్లలో సందడి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకుఅవసరమైన డేట్లను వెంకీ.. వరుణ్ తేజ్ లు ఇప్పటికే సర్దుబాటు చేసేసిన నేపథ్యంలో వేగంగా సినిమా షూట్ ను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.