స్కూల్ నుండే శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్స్

0

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కలిసి మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు ప్రస్తుతం తమ పాపతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీపావళి సందర్బంగా వీరిద్దరు సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇద్దరి మద్య పరిచయం పెళ్లి సమయంలో అయ్యింది కాదని చిన్నప్పటి నుండే ఇద్దరం స్నేహితులం అన్నారు. చిన్నతనంలో క్లాస్ లో బెంచ్ మెట్స్ అన్నారు. మా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ శ్రీజ చెప్పుకొచ్చారు.

ఇక కళ్యాణ్ దేవ్ సినిమాల ఎంపిక విషయంలో చిరంజీవి మరియు ఇతర మెగా హీరోల ఇన్వాల్వ్ మెంట్ పెద్దగా ఉండదని అన్నారు. సినిమా ఎంపిక అనేది నా నిర్ణయం అని.. సినిమాల్లోకి రావాలని చాలా కాలం నుండే అనుకున్నాను. అది సమయం వచ్చింది అలా జరిగి పోయిందని పేర్కొన్నాడు. సినిమాల్లో ప్రతిభ ఉన్న వారినే ప్రేక్షకులు ఆధరిస్తారు. నాకు ఉన్న పతిభ మరొకరికి ఉండదు.. మరొకరికి ఉన్న ప్రతిభ నాకు ఉండదు. అంటే ఎవరి ప్రతిభ వారి ప్రత్యేకం. కనుక సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాధించడం అనేది ప్రతిభపై ఆధారపడి ఉంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక శ్రీజ మాట్లాడుతూ బాబాయి పవన్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో టచ్ లో ఉంటాం. మా వాట్సప్ గ్రూప్ కు పేరు ఏమీ లేదని జస్ట్ స్మైలీ సింబల్ ఉంటుందని శ్రీజ చెప్పుకొచ్చింది.