Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ గా నితిన్

ప్రభాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ గా నితిన్


యువ హీరో నితిన్ భీష్మ సినిమా తరువాత మళ్ళీ సక్సెస్ చూడలేదు. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం.. ఇలా వరుసగా విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లతో బాగానే హడావిడి చేశారు ఇక రీసెంట్ గా ఒక టీజర్ ను విడుదల చేశారు.

నితిన్ సినిమా షూటింగ్‌లలో జూనియర్ ఆర్టిస్ట్‌లో కనిపించనున్నాడు. అలాగే భారీ యాక్షన్‌ను ప్రదర్శించడం, ఇది అతని పాత్ర గురించి చమత్కారాన్ని పెంచుతుంది. యాక్షన్ పార్ట్ స్టైలిష్ గా ఉంది. హారిస్ జయరాజ్ సంగీతం ఆకట్టుకుంది. బాహుబలి-2లోని దండాలయ్య పాటలో కనిపించిన జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్ తనను తాను హైలెట్ చేసుకున్నారు. ఇది కాస్త కామెడీగా హైలెట్ అయ్యింది.

టీజర్‌లో శ్రీ లీలతో కథానాయకుడు లవ్ ట్రాక్, ఇక రావు రమేష్‌తో రెగ్యులర్ గా ఉండే తండ్రీకొడుకుల సమస్యలు కూడా ఉన్నాయి. నితిన్ లుక్ చాలా స్టయిలిష్ గా ఉంది. అయితే అంత స్టైలిష్ గా ఉన్న హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసుకోవడం అంతగా కనెక్ట్ కావడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ దర్శకుడు ఈ ఫార్ములా తోనే కామెడీ ఎంటర్టైన్మెంట్ ను అందించే దిశగా సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. నితిన్ కు మాత్రమే కాకుండా దర్శకుడికి కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే కిక్, రేసు గుర్రం లాంటి సక్సెస్ఫుల్ సినిమాలలో రైటర్ గా భాగమైన వంశీ మొదట దర్శకుడిగా చేసిన నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో సక్సెస్ అందుకొని అతను మరో రేంజ్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. డిసెంబర్ 8న థియేటర్లలో నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇక ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.