యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

0

హాట్ సమ్మర్ లో వస్తోన్న మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి బూస్ట్ నిచ్చేలా ఈ మూవీ రూపొందింది. ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ సహా చిత్రం యూనిట్ అంతా సందడి చేస్తోంది. ప్రమోషన్స్ ను పీక్ స్టేజీకి తీసుకెళుతోంది.

2019లో విడుదలై ఫన్ ఫుల్ సక్సెస్ సొంం చేసుకున్న ‘ఎఫ్2’కి కొనసాగింపుగా ఎఫ్3 సిద్ధమైంది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ‘ఎఫ్3’ టీం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలోనే భాగంగా తెరపై చిరంజీవి, బాలయ్య, నాగార్జున పవర్ ఫుల్ డైలాగుల వీడియోలను ప్రదర్శించి వాటిని అచ్చం అలాగే అనుకరించాలని చిన్న టాస్క్ ఆడారు.

వరుణ్ తేజ్, వెంకటేశ్ , ఇతర చిత్రబృందం రెండు టీంలుగా విడిపోయి నాన్ స్టాప్ ఫన్ అందించారు. చిరు,బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్ ప్లే చేసి రీల్స్ చేయాలన్నారు. దీంతో వెంకీ, వరుణ్ జట్లు పోటీపడి సరదాగా కామెడీ చేశారు.

సుమ యాంకర్ గా సాగిన ఈ స్కిట్ లు నవ్వులు పూయించాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ నే కాదు.. అలీ, ఫృథ్వీ, మెహరీన్, ఆఖరుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీల్స్ చేసి అలరించారు. అందరిలోకి దర్శకుడు అనిల్ రావిపూడి యాక్టింగ్ అదుర్స్ అనేలా ఉంది.