యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

ఒక డైలాగ్ వల్లే ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

0

టాలీవుడ్ ను రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. రాజకీయాల దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు దెబ్బైపోతున్నాయి. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’కు రాజకీయ రంగు పులుముకుందన్న ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేయడంలో ఓ ప్రతిపక్ష పార్టీ కీలక పాత్ర పోషించిందని.. జగన్ డైలాగ్ వాడడం వల్లే ఈ సినిమాను ఆ పార్టీ తోక్కేసిందన్న టాక్ ఉంది.

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ మహేష్ సినిమాల టాక్ అయినా ఏదైనా.. ఇతర సినిమా అభిమానుల నుంచే వచ్చేది.కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ నే కొంప ముంచిందని అంటున్నారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే జగన్ డైలాగ్ ను మహేష్ బాబు ఈ సినిమాలో వాడేశాడు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ను మహేష్ పొగడడంతో టీడీపీ ఫ్యాన్స్, ఆయన మీడియా హర్టయ్యారని సమాచారం. అందుకే ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. సినిమా హిట్ అయితే ఎవరూ ఏం చేయలేకపోయేవారు. కానీ మిక్స్ డ్ టాక్ రావడంతో టీడీపీ, దాని అనుబంధ మీడియా విజృంభిస్తున్నారని సమాచారం. టీడీపీ అనుకూల మీడియా, వెబ్ సైట్లు అన్నీ ‘సర్కారువారి పాట’పై నెగెటివ్ ప్రచారం చేశారు.

ఇక విశేషం ఏంటంటే.. వైసీపీకి మద్దతుగా ఉన్న కొన్ని మీడియాలు, సినీ వెబ్ సైట్లు సైతం ‘సర్కారువారి పాట’ను భుజాన మోయలేదు. పాజిటివ్ రివ్యూలు ఇవ్వలేదు. దీంతో జనాలకు అసలు ఈ సినిమా గురించి పాజిటివ్ వేవ్ పోకపోవడంతో ఢీలా పడింది.

ముఖ్యంగా జగన్ డైలాగ్ పెట్టడంతో టీడీపీ ఫ్యాన్స్ ఈ సినిమాపై పనిగట్టుకొని నెగెటివ్ టాక్ ప్రచారం చేశారని తెలిసింది. పోటీగా వైసీపీ ఎంతగా హిట్ అన్నా కూడా అది జనాల్లోకి చొచ్చుకెళ్లలేకపోయింది. సినిమా చూశారో లేదో కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ లో ‘సినిమా బాగుందని.. జగన్ డైలాగ్ ను వల్లెవేశారు?’. ఇదే పెద్ద మైనస్ గా మారింది.

వైసీపీ బ్యాచ్ ‘సర్కారు వారిపాట’ను ఓన్ చేసుకోవడం సినిమాకు మైనస్ గా మారింది. రాజకీయాల్లోకి ఈ సినిమా వచ్చేసినట్టైంది. విజయసాయిరెడ్డి ఈ సినిమాకు రాజకీయ రంగు పులమడంతో టీడీపీ, వైసీపీ వ్యతిరేక వర్గం ఈ సినిమాకు పూర్తిగా దూరమైంది. సినిమా చూసినా ఆ వర్గం వారు నెగెటివ్ గా ప్రచారం చేశారు.

ఇక సినిమా కూడా హిట్ టాక్ రాకపోవడం మైనస్ గా మారింది. దీంతో ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుల్లో ఈ సినిమా చిత్తైపోయింది. అనవసరంగా మహేష్ బాబు ఈ సినిమా ‘జగన్ డైలాగ్ పలికి’ ఒక వర్గానికి పరిమితం కావడంతో.. వారి ప్రత్యర్థులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. రాజకీయాల్లో కెలుక్కోవడమే ఈసినిమాను దెబ్బతీసిందన్న వాదన ఉంది. సినిమా బాగుంటే ఇలాంటి ఎన్ని ప్రచారాలు చేసినా నిలబడేది కాదు.. కానీ కొంచెం మిక్స్ డ్ టాక్ రావడంతో మహేష్ బాబు సినిమా నిలబడలేకపోయింది.

ఇక బాలీవుడ్ పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా కొంప ముంచాయి. హిందీ జనాలు మొత్తం సినిమాపై నెగెటివ్ టాక్ ను వ్యాపింపచేశారు. మహేష్ చాలా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఏదో మాట్లాడి ఇప్పుడు బాలీవుడ్ పై నోరుజారి బుక్కయ్యారు. మహేష్ పాజిటివ్ గానే అన్నా అది నెగెటివ్ గా మారింది.

మొత్తానికి కంటెంట్ ఎలా ఉన్నా.. దానిబట్టి సినిమా జయాపజయాలు చూడాలి. కానీ ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుని.. వివాదాలు రాజేయడం ‘సర్కారువారి పాట’ సినిమా ఫలితాన్ని దారుణంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు.