శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..

0

Misses Vizag 2022: సాగర తీరం.. అందాల హారం. అతివల అందాలకు విశాఖ తీరం వేదికైంది. వారి హొయలు, లయలు చూస్తుంటే అందరికి ముచ్చటేసింది. అందమంటే ఆడవారిదే. వారి గురించి పొగడని కవి ఉండడు. చీరకట్టులో చూస్తే ఇక అంతే. మైమరచిపోవాల్సిందే. మిసెస్ వైజాగ్ 2022 అందాట పోటీల కోసం ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్ కు విశేష స్పందన వచ్చింది. అందాల కలబోత చూడటానికి కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. చీరకట్టి అందమైన నడకతో అందరిని ఉర్రూతలూగించారు. విశాఖ తీరం. కాస్త అందాల హారంగా మారిపోవడం గమనార్హం.

భారతీయసంస్కృతికి అద్దం పట్టేలా, సంప్రదాయం ఉట్టిపడేలా శ్రీమతులు విశాఖపట్నం తీరంలో మిసెస్ వైజాగ్ 2022 ఆడిషన్స్ కోసం అందంగా ముస్తాబై వచ్చారు. వారి అందాలతో ప్రాంగణం కాంతులీనింది. ఈవెంట్ కే కొత్త అందం వచ్చేసింది. విశాఖ నగరంలోని దొండపర్తి దగ్గర బెస్ట్ వెస్ట్రన్ హోటల్ లో నిర్వహించిన కాంటెస్ట్ కు విశేష స్పందన వచ్చింది. ఆడిషన్స్ కు దాదాపు 150 మంది మహిళలు హాజరవడంతో అందాల కనువిందు చేసింది. ఇంకొందరు ఆన్ లైన్ లో ఎంట్రీలు పంపడం విశేషం.

మిసెస్ వైజాగ్ 2022 ఆడిషన్స్ లో ప్రతిభ చూపించిన 20 మందిని పోటీదారులుగా ఎంపిక చేశారు. వీరు ఫైనల్స్ లో పాల్గొంటారనితెలుస్తోంది. ఫైనల్స్ కు ఎంపికైన వీరికి అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చి పోటీకి సంసిద్ధులను చేస్తారు. ఫైనల్ లో అదిరిపోయేలా తమప్రతి భాపాటవాలు ప్రదర్శించాలని చూస్తున్నారు. మిస్ వైజాగ్ కిరీటం దక్కించుకోవాలని అందరు ఆశిస్తున్నారు. అందుకే అన్ని విభాగాల్లో తమదైన శైలిలో నేర్చుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

మిసెస్ వైజాగ్ 2022 అందాల పోటీల ఫఇనాలే జూన్ 4న విశాఖలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరగనుంది. దీనికిగాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేస్ ఈవెంట్ మేనేజర్ రవికుమార్, డ్రీమ్స్ ఈవెంట్ మేనేజర్ అఫ్రజ్ ఖాన్ కార్యక్రమనిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శ్రీమతి వైజాగ్ 2022 ఆడిషన్స్ లో శ్రీ రాధా దామోదర్ స్టూడియో అధినేత ఫణికుమార్, డిజిపే గ్రూు ప్రతినిధి సునీల్, జేడీ ఫ్యాషన్ టెక్నాలజీస్ ఎండీ కట్టమూరి ప్రదీప్, సురక్ష హాస్పిటల్ అధినేత బొడ్డేపల్లిరఘు, ఐరిస్ డెంటల్ కేర్ ఎండీ వింజమూరి అనిల్, వరుణ్ బజాజ్ సీఈవో ఆడారిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.