Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంజూ భాయ్ గురించి ఆ వార్తలన్నీ పుకార్లే

సంజూ భాయ్ గురించి ఆ వార్తలన్నీ పుకార్లే


Fake Rumours on Sanjay Dutt

Fake Rumours on Sanjay Dutt

బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా ఇప్పటికే నిర్థారణ అయ్యింది. ఆ వెంటనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలో కూడా ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లుగా కథనాలు రాశాయి. అయితే సంజయ్ దత్ ఇంకా ముంబయిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన లీలావతి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

నేడు ఆయన లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. మాస్క్ పెట్టుకుని ఉన్న సంజయ్ దత్ చేతిలో శానిటైజర్ ను కూడా కలిగి ఉన్నాడు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్స్ కు ఇప్పట్లో హాజరు కాలేను అని ఆరోగ్యం కుదుట పడేవరకు బ్రేక్ తీసుకుంటాను అంటూ ప్రకటించాడు. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన వెంటనే అమెరికాలో చికిత్సకు వెళ్లిన విషయం తెల్సిందే. కాని సంజయ్ దత్ మాత్రం ఇండియాలోనే ట్రీట్ మెంట్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.

లక్షల్లో అక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడకు వెళ్తే కొత్త జబ్బులు వస్తాయనే ఆందోళనతో సంజయ్ దత్ ఫ్యామిలీ అక్కడకు వెళ్లేందుకు సిద్దపడటం లేదు. లీలావతి ఆసుపత్రిలో కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కనుక ప్రస్తుతానికి ఇక్కడే ఆయన ట్రీట్ మెంట్ జరుగుతోంది. త్వరలోనే ఆయన క్యూర్ అయ్యి కేజీఎఫ్ 2 చిత్రంతో పాటు ఇతర సినిమాల్లో కూడా ఆయన నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.