
Karnataka HC declines to entertain PIL against Sanjay Dutt KGF2
కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లను సాధించి కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా అయ్యింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇదే కాంబోలో కేజీఎఫ్ 2 చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ వివాదాస్పద నటుడు సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెల్సిందే. విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.
సంజయ్ దత్ బాంబు పేళుడు కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. అలాంటి వ్యక్తి కన్నడ సినిమాలో నటించేందుకు అనర్హుడు అంటూ ఒక వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. సుదీర్ఘ వాదనలు విన్న హై కోర్టు నేడు ఆ విషయమై తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అరెస్ట్ అయినంత మాత్రాన జైలుకు వెళ్లినంత మాత్రాన సినిమాలో నటించేందుకు అనర్హుడు అంటూ మేము చెప్పలేం అంటూ కోర్టు పేర్కొంది.
సినిమాలో నటించకూడదు అంటూ చట్టంలో ఉందని పిటీషనర్ చూపించలేక పోయాడు. కనుక అతడు వేసిన పిటీషన్ ను కొట్టి వేస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. దాంతో కేజీఎఫ్ చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది. అయితే ప్రస్తుతం సంజయ్ దత్ క్యాన్సర్ తో పోరాడుతున్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు షూటింగ్ కు వస్తారా అంటూ యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆయన నెల రోజులు షూటింగ్ కు వస్తే షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
