Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలీవుడ్ బ్యూటీస్ ను మరపిస్తున్న తెలుగు బికినీ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీస్ ను మరపిస్తున్న తెలుగు బికినీ బ్యూటీ


Tejaswi Madivada In Bikini

Tejaswi Madivada In Bikini

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెలుగమ్మాయి తేజస్విని చూస్తుంటే ఈమె తెలుగు అమ్మాయేనా అనే అనుమానం కలుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ అయినా కాస్త స్కిన్ షో విషయంలో వెనుక ముందు ఆడుతారేమో. కాని తేజస్వి మాత్రం అందాల ప్రదర్శన విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను దాటేసింది అనిపిస్తుంది. ఈమె సోషల్ మీడియా ఫొటోలు ప్రతి రోజు వేడి పుట్టిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఒక ఫొటో ఈమెను మరో మెట్టు పైకి తీసుకు వెళ్లేలా ఉంది. గ్లామర్ విషయంలో తెలుగు అమ్మాయిలు మొహమాట పడటం సిగ్గు పడటం చేస్తారని ఇన్నాళ్లు ఒక టాక్ ఉంది. కాని తేజస్వి విషయంతో అది నిజం కాదని తేలిపోయింది. అమ్మడి స్కిన్ షో బికిజీ షో చూసిన ఏ ఒక్కరు అయినా ఈమెకు సినిమా ఆఫర్లు ఎందుకు రావడం లేదో అనుకుంటూ ఉంటారు.

బిగ్ బాస్ తో ఈమె ఏంటో జనాలకు తెలిసింది. బుల్లి తెరపై వెండి తెరపై సుదీర్ఘ కాలంగా కనిపిస్తూ వస్తున్న తేజస్వి ఈమద్య కాలంలో ఆఫర్లు పూర్తిగా తగ్గి పోయాయి. ఓటీటీ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ కోసం ఈ అమ్మడు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఆ ఓటీటీ రాబోతుంది. అందులో ఈ అమ్మడు బోల్డ్ పాత్రలో కనిపించబోతుంది.