
star heroine husband age is 50 years
ఆమె ఆయనలో సగం. ఆమె వయసు కూడా ఆయనలో సగం. సగం కంటే కొంచెం ఎక్కువ. అయితేనేం ఆయనతో ఆమెకు లవ్ కుదిరింది. ఆ తర్వాత పెళ్లయ్యింది. ఇంట్లో పెద్దాళ్లు ఏజ్ బార్ హీరో.. వద్దే వద్దన్నా ఆమె మాత్రం ససేమిరా అంది. చివరికి అనుకున్నది సాధించుకుంది. ఈ లవ్ స్టోరి ఎవరిది? అంటే.. బెబో కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ మధ్య రన్ అయిన ఎటర్నల్ లవ్ స్టోరి.
ఇప్పుడాయన వయసు 50. ఆ సంగతిని సతీమణి కరీనా స్వయంగా చెప్పింది. అంతేనా తమ ప్రేమైక జీవనంలో సరిగమల్ని ఓ రేంజులోనే అస్వాధిస్తున్నామని చెబుతూ.. తమ రెండో బిడ్డకు సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెప్పింది.
హబ్బీ సైఫ్ అలీ ఖాన్ ను ఆశ్చర్యపరుస్తూ అతడి లైఫ్ లో 50 మనోహరమైన జ్ఞాపకాలను త్రవ్వి తీసింది బెబో. మా ఆయన 50 వ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయని చెబుతూనే పుట్టినరోజును చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది.
సైఫ్ జీవితంలో 50 సంవత్సరాల పయనానికి సంబంధించి 22 నిమిషాల నిడివితో వీడియోను బెబో షేర్ చేసింది. అతడు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు రకరకాల దశల్లోని ఫోటోలతో కూడిన వీడియో ఆకట్టుకుంది. సైఫీనా జంట తమ రెండవ బిడ్డను ఆశిస్తున్న వేళ ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం అని అభిమానులకు అర్థమవుతోంది. బర్త్ డే వేళ కుటుంబీకులు.. అభిమానులు స్నేహితుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు అందాయి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
