‘పాన్ ఇండియా స్టార్’ రేంజిని ఆ హీరో నిలబెట్టుకోలేక పోతున్నాడా..??

0

Prabhas Is Taking More Time Between Back to back movies

Prabhas Is Taking More Time Between Back to back movies

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. అప్పటినుండి దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ చేసే సినిమాలు భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. సి. అశ్వినీదత్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుందనీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. డార్లింగ్ ప్రభాస్ బాహుబలి తర్వాత తన ప్రతీ సినిమాకి మధ్య ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఎందుకని సినిమా సినిమాకి మినిమం రెండు సంవత్సరాల టైం తీసుకుంటున్నాడు. బాహుబలికి ఐదేళ్లు వెచ్చించిన ప్రభాస్.. తర్వాత సాహోకి రెండేళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు రాధేశ్యామ్ కోసం రెండేళ్ల పైనే అవుతోంది. బాహుబలి సినిమా 2015లో విడుదల కాగా.. 2017లో బాహుబలి-2 విడుదలైంది. ఆ తర్వాత 2019లో సాహో వచ్చింది. ఇప్పుడు సాహో వచ్చి కూడా ఏడాది కావస్తుంది. గతేడాది ఆగష్టులో విడుదలైంది సాహో. కానీ ఇంతవరకు రాధేశ్యామ్ రెడీ కాలేదు. కనీసం 50% షూటింగ్ కూడా పూర్తికాలేదట. కరోనా ప్రభావం ఉండి ఈ సినిమా లేట్ అయింది అనుకుంటే.. మరి ఇంకెప్పుడు రాధేశ్యామ్ రెడీ అవుతుంది. సాహో విడుదలకు ముందే రాధేశ్యామ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలు పెడతామని అంటున్నారు. 2021లో కూడా విడుదల అవుతుందని గ్యారెంటీ కనిపించడం లేదు. ఇక నాగ్ అశ్విన్ తో సినిమా ఎన్నేళ్లు టైం తీసుకుంటుందో అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఇలా డిలే చేస్తే పాన్ ఇండియా అనే రేంజికి భంగం వాటిల్లుతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి దీని పై ప్రభాస్ ఏదైనా స్పందిస్తాడేమో..!!